విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఎస్పీ రాజకుమారి పర్యటించారు. దిగువ మండంగి, బాహజ్వాల గ్రామాలను సందర్శించి.. గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు, చిన్నారులకు పండ్లు, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. గిరిజనులకు వైద్య సహాయాన్ని అందించేందుకు మెగా వైద్య శిబిరాన్ని దుగ్గేరులో ప్రారంభించారు. వైద్య బృందం సహకారంతో వైద్య సేవలందించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.



మక్కువ మండలం ఎర్రసామంతవలస గ్రామంలో నిర్వహించిన మెగా వాలీబాల్ టోర్నమెంట్ను ఎస్పీ బి.రాజకుమారి ప్రారంభించారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. దేశానికి సేవ చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతి యువత చేతుల్లోనే ఉందన్నారు.
ఇదీ చదవండి: రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం ఇవ్వాలి: పవన్