ETV Bharat / state

'తక్కువ వ్యవధిలో వృద్ధి చెందే మొక్కలు నాటాలి'

author img

By

Published : Jan 20, 2021, 7:55 PM IST

దీర్ఘకాలంలో పెరిగే మొక్కలు కాకుండా తక్కువ వ్యవధిలో వృద్ధి చెందే మొక్కలను నాటాలని విజయనగరం కలెక్టర్​ హరిజవహర్ లాల్​ అన్నారు. జిల్లా సామాజిక అట‌వీ అభివృద్ధి క‌మిటీ స‌మావేశం కలెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న క‌లెక్ట‌రేట్​లో జ‌రిగింది.

collector
'తక్కువ వ్యవధిలో వృద్ధి చెందే మొక్కలు నాటాలి'

నేల స్వ‌భావాల‌కు త‌గిన మొక్క‌ల‌ను గుర్తించి నాటేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిజ‌వ‌హ‌ర్​లాల్.. అధికారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు సూచించారు. దీర్ఘ‌కాలంలో పెరిగే మొక్క‌లు కాకుండా త‌క్కువ వ్య‌వ‌ధిలోనే వృద్ధి చెందే మొక్క‌ల‌ను నాటాల‌న్నారు. జిల్లా సామాజిక అట‌వీ అభివృద్ధి క‌మిటీ స‌మావేశం కలెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జ‌రిగింది. మొక్క‌ల‌కు త‌గిన సంర‌క్ష‌ణ‌ ఉన్న‌చోట పూలు, ప‌ళ్ల‌జాతుల మొక్క‌ల‌ను నాట‌వ‌చ్చ‌ని సూచించారు. మొక్క‌లు నాట‌డంతోపాటు ఇప్ప‌టికే నాటిన మొక్క‌లు, వృక్ష సంప‌ద‌ ప‌రిర‌క్షణకూ చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి అవసరం ఉందన్నారు.

జిల్లా సామాజిక అట‌వీ అధికారి జాన‌కిరావు, జిల్లా అట‌వీ అధికారి స‌చిన్‌గుప్తా, జిల్లా ప‌రిష‌త్ సీఈవో టి.వెంక‌టేశ్వ‌ర‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్ రాజ్ కుమార్‌, గిరిజ‌న సంక్షేమ‌శాఖ డీడీ కిర‌ణ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: బొబ్బిలి పోలీస్​శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత వారోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.