విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాదిలో ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు. వాసుదేవరావు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేయటంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. అతను కేకలు వేయడంతో వారు పారిపోయారు. కొట్టుమిట్టాడుతున్న వాసుదేవరావుకు కుటుంబసభ్యులు విశాఖలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: 'వాళ్లను విధుల్లోకి తీసుకోండి'