విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేసి... వారి నుంచి 6లక్షల 76వేల విలువైన 154.7గ్రాముల బంగారం, 6.24కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజకుమారి మీడియాకు వివరించారు. స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు బొబ్బిలి పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో తనిఖీలు చేయగా... ఈ ఆభరణాలు పట్టుబడ్డాయని ఎస్పీ చెప్పారు. ఆ దుకాణ నిర్వాహకులను విచారించగా... అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టు రట్టయిందని రాజకుమారి వివరించారు.
ఖమ్మం జిల్లా కొయ్యలగూడెనికి చెందిన రాజేష్... పశ్చిమగోదావరి జిల్లా సారిపల్లికి చెందిన పండు, ఏలూరుకు చెందిన రమేష్తో కలిసి... విజయవాడ, ఒంగోలు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. దొంగిలించిన ఆభరణాలను నగదుగా మార్చుకునే ప్రయత్నంలో... బొబ్బిలిలో వస్త్రదుకాణం నిర్వహిస్తున్న ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. దోచుకున్న ఆభరణాలను ఆ యువకుడి ద్వారా అమ్మకానికి ప్రయత్నిస్తుండగా... పోలీసులకు పట్టుబడ్డారని ఎస్పీ వివరించారు.
ఇదీ చదవండీ...'ఆంధ్రాబ్యాంక్'... ఇక కనపడదు