సాలూరు మండలం దేవ్పేట గ్రామంలో ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన మరపు బ్రహ్మయ్య కుటుంబసభ్యులు దేవుడికి దీపం పెట్టి పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఆ దీపం కిందపడి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. పక్కనే ఉన్న పశువుల పాక, ఎదురుగా ఉన్న ఈశ్వరరావు అనే వ్యక్తి ఇల్లు కాలిపోయాయి. ఈశ్వరరావు ఇంట్లో గ్యాస్ సిలిండర్ కూడా పేలి చలమాల నరసింహులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న గడ్డివాము కాలిపోయింది. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సాలూరు సీహెచ్సీకి తరలించారు.
ఇదీ చూడండి నెల్లూరులో మరో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి