ETV Bharat / state

లాంఛనంగా వైఎస్సార్​ జలకళ పథకం వాహనాలు ప్రారంభం

author img

By

Published : Oct 2, 2020, 8:49 AM IST

సన్న, చిన్నకారు రైతులకు వరమైన వైఎస్సార్​ జలకళ పథకం వాహనాలను విశాఖ జిల్లాలో స్థానిక ఎమ్మెల్యేలు రిగ్గులను లాంఛనంగా ప్రారంభించారు. రైతులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలంటూ పేర్కొన్నారు.

ysr jalakala scheme by mla's in visakha district
చోడవరంలో వైఎస్సార్​ జలకళను ప్రారంభించిన ఎమ్మెల్యే

విశాఖ జిల్లాలోని దేవరాపల్లి, చోడవరం, నర్సీపట్నం మండలాల్లో రైతుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్​ జలకళ పథకం వాహనాలను స్థానిక ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభించారు.

దేవరాపల్లి

వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం వైఎస్సార్​ జలకళ పథకాన్ని రూపకల్పన చేసిందని ప్రభుత్వ విప్​ బూడి ముత్యాలనాయుడు అన్నారు. దేవరాపల్లి, తారువ గ్రామాల్లో వైఎస్సార్​ జలకళ పథకం రిగ్గు వాహనాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలు, రైతులు రిగ్గు వాహనానికి హారతులతో స్వాగతం పలికారు. సన్న, చిన్నకారు రైతులకు ఈ పథకం వరమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం పొందేందుకు రైతులు.. గ్రామ సచివాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

చోడవరం

వైఎస్సార్​ జలకళ కార్యక్రమాన్ని చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ శ్రీకారం చుట్టారు. చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే రిగ్​ను ప్రారంభించారు. వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలన్నది ముఖ్యమంత్రి జగన్​ ఆశయమని ఆయన తెలిపారు. వర్షాధార భూములు కలిగిన రైతులందరూ జలకళను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

నర్సీపట్నం

పెద్ద బొడ్డేపల్లి వైకాపా కార్యాలయం వద్ద వైఎస్సార్​ జలకళ వాహనాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్​ గణేష్ లాంఛనంగా​ ప్రారంభించారు. రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే విధంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన అన్నారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చి హామీల్లో భాగంగా రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే విధంగా పథకాలను రూపకల్పన చేసి అర్హులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ :

గ్రామాల్లో వైఎస్సార్ జలకళ వాహనం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.