ఎస్సీలకు రద్దు చేసిన పథకాలు పునరుద్ధరించాకే తమ గడప తొక్కాలని.. విశాఖ గాజువాకలో విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ప్రచారం చేపట్టింది. గాజువాకలోని అగనంపూడిలో.. ఇంటింటా కర పత్రాలు, స్టిక్కర్లను పంచారు. ఎస్సీలు కోరి ఎన్నుకున్న వైకాపా ప్రభుత్వం.. వారికి అన్ని విధాలా ద్రోహం చేసిందని ఐక్య వేదిక నాయకులు విమర్శించారు.
గతంలో అమలులో ఉన్న కార్పొరేషన్ రుణాలు, చట్టబద్ధంగా రావాల్సిన సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలను మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి ప్రజాచైతన్యం ద్వారా సాధించుకుంటామని స్పష్టం చేశారు.
ఎస్సీ కార్పొరేషన్ మూత పడిందని.. తక్షణమే సబ్ ప్లాన్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ కు కనీసం రూ.3000 కోట్లు కేటాయించి.. రుణాల మంజూరు పునఃప్రారంభించాలని ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. పాలకులు తమ గడపకు వచ్చే ముందు.. రద్దు చేసిన పథకాలన్నీ పునరుద్ధరించాలని కోరారు.
ఇదీ చదవండి: