కచ్చులూరు రాయల్ వశిష్ఠ పున్నమి బోటు ప్రమాద కేసులో మరో ఇద్దరిని విశాఖ జిల్లా రంపచోడవరం పోలీసులు అరెస్టు చేశారు. బోటు యజమానుల సంఘం ప్రతినిధులు వెంకటరమణ, రాజారావును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే బోటు యజమాని, ఇద్దరు మహిళలను విశాఖ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల పేరిట కేసు నమోదుచేశారు.
ఇదీ చదవండి: