విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో పాత జాతీయ రహదారి పై వంతెన వద్ద రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో.. ఆరుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది.. ఓ శుభకార్యం నుంచి తిరుగు ప్రయాణంలో ఆటో ఎక్కారు. శేషు గడ్డ వంతెన వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న మరో ఆటో ఢీకొంది. ఈ ఘటనలో చెరుకుపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీ చూడండి: