విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం సమావేశమైంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ పిల్ల రమాకుమారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కరోనా నివారణ చర్యలపై చర్చించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
పాత జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న మురికి కాలువలు శుభ్రం చేయించాలని తీర్మానం చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఆస్తి పన్నుల వసూళ్లు కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని వివరించారు.
ఇదీ చదవండి: