విశాఖలో జర్నలిస్టుల బ్యాడ్మింటన్- వివరాలు వెల్లడిస్తున్న వైజాగ్ ప్రొఫైల్ ఛైర్మన్ జర్నలిస్టులకు రాష్ట్ర స్థాయి షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు వైజాగ్ ప్రొఫైల్ ఛైర్మన్ కృష్ణారావు తెలిపారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ క్రీడాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో గాజువాక గ్రీన్ సిటీ లక్ష్య బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం వేదిక పోటీలు జరగనున్నాయి. వైజాగ్ ప్రొఫైల్ సంస్థ ఈ పోటీలకు స్పాన్సర్గా వ్యవహరిస్తుందని వివరించారు. ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న పోటీల్లో 13 జిల్లాల జర్నలిస్టులు పాల్గొనాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు వసతులు ఏర్పాట్లు పూర్తైనట్లు తెలిపారు.ఇదీ చదవండి: గంధం నందగోపాల్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు