కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ చట్ట సవరణ 2020కు నిరసనగా విశాఖ జిల్లా పాయకరావుపేటలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ బిల్లు ద్వారా ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. తక్షణమే చట్ట సవరణ బిల్లును నిలుపుదల చేయాలని కోరారు.
ఇదీ చదవండి: 'దాడికి పాల్పడిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి'