ETV Bharat / state

మోదీ జన్మదిన వేడుకలు.. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు

author img

By

Published : Sep 17, 2020, 4:38 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా మోదీ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల భాజపా నేతల ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. మరి కొన్ని చోట్ల ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

blood donation on occasion of modi birth day
మోదీ జన్మదిన వేడుకలు

విశాఖ జిల్లాలో..

విశాఖ ఏజెన్సీ పాడేరులో ప్రధాన మంత్రి మోదీ జన్మదినాన్ని భాజపా నేతలు ఘనంగా నిర్వహించారు. పాడేరు ఆసుపత్రిలో భాజపా నాయకులు రెడ్​ క్రాస్, ముద్ర బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు పండ్లు, బ్రెడ్​ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు పాంగి రాజారావు, రామకృష్ణ, రవికుమార్, వేమన, డాక్టర్ ప్రవీణ్ వర్మ లు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లాలో..

గుంటూరు భాజపా జిల్లా కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే.. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని అన్నారు.

అనంతపురం జిల్లాలో..

మోదీ జన్మదిన సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 100 మంది భాజపా కార్యకర్తలు రక్తదానం చేసినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. పట్టణంలో వాహనాల ర్యాలీ నిర్వహించి.. గోశాలలో కేక్ కట్ చేశారు. అనంతరం గోవులకు పచ్చగడ్డి వితరణ చేశారు.

యువమోర్చా ఆధ్వర్యంలో...

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా అనంతపురంలోని గీతా మందిరంలో భాజపా యువ మోర్చా నేతలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు యువకులు, నేతలు రక్తదానం చేశారు. ప్రధాని మోదీ ప్రపంచం గర్వించదగ్గ నాయకుడని అనంతపురం జిల్లా భాజపా అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించటంలో ప్రధాని గొప్పగా పని చేస్తున్నారని అన్నారు.

కృష్ణా జిల్లాలో..

కృష్ణా జిల్లా పామర్రులో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి.. నిత్యవసర వస్తువులతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు.

విజయనగరం జిల్లాలో..

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా విజయనగరం భాజపా కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ఆడిటర్ డి బాలాజీ, కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి వెంకట అప్పారావు భాజపా చేరారు. వారికి భాజపా జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని కండువా వేసి ఆహ్వానించారు.

ప్రకాశం జిల్లాలో...

మోదీ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరి భాజపా నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భాజపా స్వచ్ఛ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పులి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లోనే ఎన్నో సంస్కరణలు చేశారని గుర్తుచేసుకున్నారు. మోదీ భారతదేశాన్ని ప్రపంచ దేశాల జాబితాలో అగ్రగామిగా నిలబెట్టారని కొనియాడారు.

ఇదీ చదవండి: అమరావతే ఆశగా... రాజధాని సాధనే శ్వాసగా రైతుల ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.