ETV Bharat / state

స్వచ్ఛ రిక్షాలకు తుప్పు.. నిర్లక్ష్యంలో అధికారులు - విశాఖ ఏజెన్సీలో స్వచ్ఛ సైకిల్స్ తాజా వార్తలు

లక్షలు వెచ్చించి అందుబాటులోకి తెచ్చిన స్వచ్ఛ రిక్షాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రజా ధనం వృథా అయ్యింది.

paderu municipal corporation
విశాఖ ఏజెన్సిలో స్వచ్ఛ రిక్షాల పరిస్థితి
author img

By

Published : Feb 6, 2020, 10:35 PM IST

Updated : Feb 8, 2020, 8:15 AM IST

విశాఖ ఏజెన్సీలో స్వచ్ఛ రిక్షాల పరిస్థితి

విశాఖ ఏజెన్సీ పరిధిలోని పలు పంచాయతీల్లో లక్షలాది రూపాయలు విలువ చేసే పారిశుద్ధ్య పనిముట్లు.. పాడైపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. ఇవి మరమ్మతులకు నోచుకోకుండా మూలన పడుతున్నాయి. గత ఏడాది జూలైలో... విశాఖ ఏజెన్సీ పరిధిలోని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ నిమిత్తం... ప్రతి పంచాయతీకి 2 నుంచి 10 వరకు స్వచ్ఛ రిక్షాలు అందజేశారు. ఒక్కో రిక్షాకు 12వేల రూపాయల వరకు వెచ్చించారు. వాటి వాడకంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. ఏ స్థాయిలోను వాటిని వినియోగంలోకి తీసుకురాలేదు. ఫలితంగా.. లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనం నిరూపయోగమయింది. పాడేరు మేజర్ పంచాయతీకి వచ్చిన ఎనిమిది స్వచ్ఛ రిక్షాలు చక్రాలు పీకి నిలవ గదిలో పడేశారు. పిల్లలు ఆడుకునే వస్తువులుగా.. పంచాయతీ సర్పంచుల ఇళ్లకు రక్షణ గోడల్లా.. మారి మూలుగుతున్నాయి. అయినప్పటికీ వీటి నిర్వహణ గురించి పంచాయితీలు పట్టించుకోవడం లేదు. మండల స్థాయి అధికారులు ఈ విషయంపై దృష్టి సారించడం లేదు. వీటిపై అధికారులను ప్రశ్నిస్తే సిబ్బంది అందుబాటులో లేరంటున్నారు. మన్యంలో వీటి అవసరం లేదంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి:

అమరావతి రైలు అటకెక్కింది

Last Updated : Feb 8, 2020, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.