విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో చివరిరోజున సాయంత్రం ఐదు తర్వాత కూడా అధికారులు నామినేషన్లు స్వీకరించారు. రాత్రి ఏ సమయం అయినా సరే ఐదు గంటల వరకు కార్యాలయానికి చేరుకున్న వారందరి నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరిరోజున పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రావటంతో ఈ పరిస్థితి ఎదురైంది.
ఎలమంచిలి మండలంలో తెదేపా, వైకాపా, జనసేన పార్టీల మద్దతుదారులు ఊరేగింపుగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఏటికొప్పాకలో అత్యధికంగా నామినేషన్లు నమోదయ్యాయి. మూడు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ అనుచరులను బరిలోకి దింపాయి. మేజర్ పంచాయతీలలో గట్టి పోటీ కనిపిస్తోంది. ఐదు పంచాయతీలకు కలిపి ఒకచోట నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి