ఇప్పటికే అనేకమంది కరోనా బారిన పడి కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇబ్బందులు పడుతున్నారని.. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఎమ్మెల్యే గణబాబు తీసుకెళ్లారు. ఎలాంటి సదుపాయాలు లేకుండా నడుస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోజువారీ ఫీజులు లిమిట్ చేసినా.. ఎక్కడ అమలు కావడం లేదని లేఖలో వివరించారు. ఏ ఆసుపత్రిలోనూ ఇప్పటికి ఆరోగ్య శ్రీ సేవలు అందించటం లేదని వ్యాఖ్యానించారు. డిశ్ఛార్జి అయిన వారి దగ్గర నుంచి.. ఆసుపత్రుల ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే గణబాబు కోరారు.
ఇదీ చదవండి: అంతర్వేది రథం దగ్ధం ఘటన: ఆలయ ఈవో బదిలీ: వెల్లంపల్లి