కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ, ప్రజలపై ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ ప్రహార్ పేరిట నిర్బందాన్ని అమలు చేస్తున్నాయని మల్కన్‌గిరి, కోరాపుట్ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి రాకేష్ ఆరోపించారు. ఈ మేరకు దానికి సంబంధించిన ఆడియో టేపులను విడుదల చేశారు. ఈ అణిచివేత దాడులను వ్యతిరేఖిస్తూ ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకూ మావోయిస్టు అమరవీరుల సంస్మరణ సభలు వాడవాడలా నిర్వహించాలని రాకేష్ తెలిపారు.
ఈ వారోత్సవాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ ఉద్యమంలో ప్రజల పక్షాన పోరాడి గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూలై వరకూ సంవత్సర కాలంలో ఏవోబీలో సుమారు 13 మంది మావోయిస్టులు అమరులయ్యారని ప్రకటించారు. ఇందులో 10 మంది మావోయిస్టు పార్టీ కార్యకర్తలు కాగా, ముగ్గురు విప్లవ ప్రజలను పోలీసులు కాల్చిచంపారని, వీరు కాకుండా మరో ఇద్దరు మావోయిస్టులు అనారోగ్యంతో చనిపోయారని, వీరికి మావోయిస్టు పార్టీ తరుపును జోహార్లు తెలిచేస్తున్నట్లు ఎంకేవి కార్యదర్శి రాకేష్ తెలిపారు.
మావోయిస్టు పార్టీ ఉద్యమంలో ఉంటూ బడుగు బలహీన వర్గాలు కోసం పోరాడిన మృతుల ఆశయ సాధనకు కృషిచేస్తామని, అమరులైన కుటుంబాలకు ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. వారోత్సవాలను ప్రజలు స్వచ్చంధంగా నిర్వహించుకోవాలని... ఇది బంద్ పిలుపు కాదని సంస్మరణ సబలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు.
ఇదీ చదవండి: