విశాఖలో హత్యా నేరం కింద గణేష్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. భీమిలి నియోజరవర్గ పరిధిలో పాపాయమ్మ అనే వృద్ధురాలి గొలుసు దొంగిలించేందుకు యత్నిస్తూ గణేష్ భౌతిక దాడి చేసినట్లు నేర విభాగం అదనపు డీసీపీ వెల్లడించారు. ఈ నెల 13న దాడి జరిగిన తర్వాత వృద్ధురాలు మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
ఇదీ చదవండి: