ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి లోకేష్
'అవినీతిపరుడికి ఓటు వేయకండి' - దేవరాపల్లి
మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ పసుపు-కుంకుమ సొమ్ము అందించిన చంద్రబాబుకు ఓటు వేస్తారో, పసుపు-కుంకుమలు చెరిపేసే జగన్కు ఓటు వేస్తారో ప్రజలే నిర్ణయించాలన్నారు మంత్రి లోకేశ్.

బహిరంగ సభలో మాట్లాడుతున్న నారా లోకేష్
ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి లోకేష్
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా రెండు వేలు అందిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గ మండల కేంద్రం దేవరాపల్లిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార బహిరంగ సభకు మంత్రితో పాటు.. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, పలువురు నేతలు హాజరయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని లోకేశ్ అభ్యర్థించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రెండు విడతల్లో పసుపు-కుంకుమ సొమ్ము అందించిన చంద్రబాబుకు ఓటు వేస్తారో, పసుపు-కుంకుమలు చెరిపేస్తున్న జగన్ కి ఓటు వేస్తారో ప్రజలే నిర్ణయించాలన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రూ.లక్షల కోట్లు జగన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నియోజకవర్గంలో గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఇప్పటివరకు 24 మార్లు మాత్రమే శాసనసభకు వచ్చారని... ప్రజల సమస్యలు కనీసం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.మాడుగుల నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడును భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.