విశాఖ జిల్లా నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 20, 21 తేదీల్లో సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి అధికారిని జీవి రమణి వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ ఆయాల పోస్టుల భర్తీకిగాను ముఖ పరీక్షలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
ఈ నెల 20వ తేదీన నక్కపల్లి , కోటవురట్ల ప్రాజెక్టు పరిధలో, 21న నర్సీపట్నం, రావికమతం ప్రాజెక్టుల పరిధిలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఉదయం 10 గంటలకు కార్యకర్తలు, ఆయాలకు... మధ్యాహ్నం రెండు గంటలకు మినీ ఆయాలకు ఉంటాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: