ETV Bharat / state

జనవరి 1 నుంచి నూతన మోటార్ వాహనాల చట్టం

author img

By

Published : Dec 14, 2020, 9:20 PM IST

మోటార్ వాహనాల చట్టం-2021 చట్టాన్ని 2021 జనవరి నుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం వాహనాలను కేటగిరీల వారీగా విభజించారు.

implementation-of-the-new-motor-vehicles-act-2021-from-january-1st
జనవరి ఒకటి నుంచి నూతన మోటార్ వాహనాల చట్టం-2021 అమలు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన మోటార్ వాహనాల చట్టం-2021... జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా భారీగా పెరగనుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ చేసింది.

నూతన చట్టం ప్రకారం విధించే జరిమానాలు...

  • హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,035 జరిమానా. రెండోసారి శిరస్త్రాణం లేకుండా పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు.
  • చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.5,035 జరిమానా. ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా.
  • డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా.
  • అధిక వేగంతో వాహనం నడిపితే రూ.1,035 జరిమానా.
  • రెడ్​ సిగ్నల్ పడిన తరువాత నిబంధన అతిక్రమిస్తే రూ.1,035 జరిమానా.
  • మైనర్లకు వాహనం ఇస్తే రూ. 5,035 జరిమానా.
  • వాహనానికి సరైన ధ్రువపత్రాలు లేకుంటే రూ. 2వేలు, రెండోసారి పట్టుబడితే రూ. ఐదు వేలు జరిమానా.
  • పర్మిట్ లేని వాహనానికి రూ.10,000, ఓవర్ లోడ్​కు రూ.20,000 జరిమానా.
  • పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు.
  • అంబులెన్స్, ఫైరింజన్లకు దారి ఇవ్వకపోతే రూ.పదివేలు జరిమానా.

ఇదీచదవండి.

పోలవరం ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గదు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.