విశాఖ జిల్లా అనకాపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 88వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ఐ.ఆర్ గంగాధర్ కేక్ కట్ చేశారు.
2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ అందించిన సేవలను ఆయన కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. నేటి భాజపా పాలనలో ఆర్థిక వ్యవస్థ తుడిచిపెట్టుకుపోయిందని మండిపడ్డారు.
ఇదీ చూడండి: