విశాఖ జిల్లా పాయకరావుపేట వైకాపాలో వర్గపోరు మొదలైంది. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల వారు పాయకరావుపేట మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ పదవిని ఆశించడంతో.. ఎవరికి అవకాశం దక్కుతుందోననే ఆసక్తి నెలకొంది. పార్టీ మద్దతుతో గెలిచిన.. అభ్యర్థుల సహకారం ఉన్న తమ అభ్యర్థికి ఉప సర్పంచి పదవి ఇవ్వాలని మండల పార్టీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబురావు కోరుతున్నారు. మరోవైపు పార్టీ అభ్యర్థులతో పాటు ఇతరుల మద్దతు ఉందని.. తమకే ఆ పదవీ కావాలని మరో వర్గం వారు పట్టుపడుతున్నారు. ఉప సర్పంచి ఎన్నికను అడ్డుకొని, పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న పట్టణ అధ్యక్షుడు సాయిబాబాను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయాలని ధనిశెట్టి బాబూరావు డిమాండ్ చేశారు. కాగా ఎవ్వరికి వారు శిబిరాలు ఏర్పాటు చేసుకొని వార్డు సభ్యులను మంచి చేసుకుంటున్నారు.
ఇవీ చూడండి...