వేడినీళ్లు మీద పడి మూడేళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన విశాఖపట్నం పాడేరు ఏజెన్సీలో చోటు చేసుకుంది. మూడేళ్ల లలిత ప్రియ ఆడుకుంటున్న సమయంలో, ప్రమాదవశాత్తు పొయ్యి మీద పెట్టిన వేడినీళ్లు ఆమెపై పడ్డాయి. తీవ్రంగా గాయపడిన లలితను పెదబయలు ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పాడేరు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు అక్కడికి తీసుకెళ్లకుండా కీలగాఢలో నాటు వైద్యం చేయించి ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికే 60 శాతం కాలిపోయిన శరీరంతో ఉన్న లలిత ఆరోగ్యం మరింత విషమించింది. ఇంటికి తీసుకొచ్చిన కొద్దిసేపటికి మృతి చెందింది. అప్పటివరకు కంటి ముందు, ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారి మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చూడండి: 370రద్దుతో ఒక్కటైన 'కశ్మీరీ-రాజస్థానీ' ప్రేమజంట