brothers die of electrocution in visakha: విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. పొలంలో విద్యుదాఘాతంతో మృతి చెందారు. మృతులు గండ్రెడ్డి గురుమూర్తి(60), గండ్రెడ్డి సత్యం(50)గా గుర్తించారు.
అన్నదమ్ములిద్దరూ వేకువజామున పశువులకు దాణా తీసుకుని పొలానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. విద్యుత్ తీగలు తెగి పడి ఉండటాన్ని గమనించకపోవటంతో ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రమాదానికి గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి