ETV Bharat / state

మోదీ, షా అబద్ధాలకు కాలం చెల్లింది: మమత

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందని పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ అన్నారు. చంద్రబాబు మళ్లీ వస్తేనే ఏపీ అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు. ప్రధానిపై తీవ్ర విమర్శలు చేసిన మమత... దేశానికి మోదీ, షా అవసరం లేదని స్పష్టం చేశారు.

పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ
author img

By

Published : Mar 31, 2019, 9:10 PM IST

Updated : Mar 31, 2019, 9:23 PM IST

పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ
"విశాఖ సుందరమైన నగరం.... ఇక్కడి వాతావరణం నాకు చాలా నచ్చింది" అంటూ... విశాఖ తెదేపా బహిరంగ సభలో స్వచ్ఛమైన తెలుగు మాటలతో ప్రసంగం ప్రారంభించారు.. పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ. చంద్రబాబుకు సంఘీభావంగా.. విశాఖ సభకు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​తో కలిసి హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముడిపడి ఉందని మమత స్పష్టం చేశారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఏపీ అభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు. విశాఖ వేదికగా తెదేపాకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె... ఏపీ ప్రజలు ఈసారి ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

మోదీ, అమిత్‌షా అబద్ధాలకు కాలం చెల్లింది

మోదీ రాష్ట్ర నేతలను భయపెడుతున్నారని మమతా బెనర్జీ అన్నారు. ఆయన ప్రజలకు కాపలాదారు కాదు... దోపిడీదారులకు కాపలదారు అని విమర్శించారు. మోదీ, అమిత్ షాల అబద్దాలకు కాలం చెల్లిందని అన్నారు.

గతంలో ఛాయ్ వాలా.. ఇప్పుడు చౌకీదార్

నిత్యం అబద్దాలు మాట్లాడే మోదీ... పుల్వామా ఘటన తర్వాత ఒక్కసారైనా మీడియా సమావేశం పెట్టారా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఛాయ్ వాలాగా వచ్చిన మోదీ, ఇప్పుడు చౌకీదార్ అంటూ వస్తున్నారని విమర్శించారు. దేశానికి భాజపా చేసిందేమీ లేదన్నారు. మోదీ అసమర్థ పాలనపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

మోదీని సాగనంపితేనే దేశానికి భద్రత

మోదీ పాలనలో సైనికులు, రైతులు అనేక మంది చనిపోయారని మమతా విమర్శించారు. బంగాల్, ఒడిశాలో అనేక పనులు చేశామని మోదీ అబద్దాలు చెప్పారన్నారు. ఉత్తరప్రదేశ్​లో ఈసారి భాజపాకు 10 సీట్లు కూడా రావని అన్నారు. మోదీ హఠావ్.. అంటూ నినాదాలు చేశారు. వందేమాతరం అని నినదిస్తూ సభికులను ఉత్తేజపరిచారు.

sample description
Last Updated : Mar 31, 2019, 9:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.