శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు గ్రామంలో తెదేపా నేత కూన రవికుమార్.. గ్రామస్థులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. దాదాపు 1000 కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి సరుకులు అందించారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలమైందని విమర్శించారు. ప్రతి కుటుంబానికి 5 వేల రూపాయల సాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: