శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వ్యవసాయ మార్కెట్లో సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్ర గోదామును ప్రారంభించారు.
ఈ గోదాము ద్వారా 7 మండలాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలు పంపిణీ అవుతాయన్నారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నతీరును.. అధికారులు సభాపతికి వివరించారు.