శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు పడ్డారు. ఖరీఫ్ విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయం వద్ద బారులుతీరారు. బయోమెట్రిక్ విధానంలో విత్తనాలను పంపిణీ చేయడం వలన పంపిణీ ప్రక్రియ జాప్యం జరుగుతోంది. విత్తనాలు పంపిణీ రెండు వేరువేరు చోట్ల చేస్తోన్నందున రైతులు అటూ ఇటూ పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా ప్రతి రైతుకు రెండు బస్తాల విత్తనాలు రాయితీపై ఇస్తున్నారు. వీటి కోసం రైతన్నలు అష్టకష్టాలు పడ్డారు.
ఇవీ చూడండి : మంత్రులకు శాఖల కేటాయింపు... హోంమంత్రిగా సుచరిత