శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నారిపేట గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి 1000 మద్యం సీసాలు పట్టుకున్నారు. వీటి విలువ రూ.రెండు లక్షల వరకు ఉంటుందన్నారు. అక్రమంగా మద్యం నిల్వ చేసిన పైడి కళ్యాణి, చింతల పాపారావులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో మద్యం పట్టుబడలేదన్నారు.
ఇదీ చదవండి