ఉద్ధృతంగా బహుదానది ప్రవాహం - శ్రీకాకుళం బహుదా నది తాజా వార్తలు
రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు... శ్రీకాకుళం జిల్లాలోని బహుదా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నిన్న సాయంత్రానికి 44 వేల 342 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం... ఇవాళ ఉదయానికి మరింత పెరిగింది. ఒడిశాలోని ప్రాజెక్టుల నుంచి దిగువకు నీరు వదలడం వల్లే ఉద్ధృతి పెరిగిందని అధికారులు తెలిపారు. వరద నీరు పెరిగితే గ్రామాల్లోకి నీరు వస్తుందని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.