TWO DEAD: శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం సుబ్బరాయునిపల్లెకు చెందిన రైతు.. కొత్తగా విద్యుత్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ ఇచ్చేందుకు అనుమతి లభించడంతో తోటి రైతులందరూ కలిసి విద్యుత్ స్తంభాలను తరలించేందుకు సిద్ధమయ్యారు. మండల పరిధిలోని కోటూరు విద్యుత్ ఉపకేంద్రం నుంచి సుబ్బరాయునిపల్లెకు ఏడు విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నారు.
డ్రైవర్‌తో పాటు మరో 8 మంది రైతులు స్తంభాలను దించుకునేందుకు వీలుగా ట్రాక్టర్లోనే బయలుదేరారు. ట్రాక్టర్ మండ్లిపల్లి వద్ద అదుపు తప్పిబోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దండువారిపల్లికి చెందిన వెంకమల్లప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన మిగతావారిని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. చంద్రశేఖర్‌రెడ్డి కదిరి ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించాడు. గోవిందునాయుడు అనే వైద్యుల సూచనతో అనంతపురానికి తరలించారు.
మరో ముగ్గురు కదిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ స్తంభాలను తరలించే బాధ్యత సాధారణంగా విద్యుత్ గుత్తేదారులదే. అయితే రైతులే ఎందుకు తరలిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నారు. దర్యాప్తు చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: