ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురూపాలెంలో శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. స్వామివారి రధోత్సవం ఘనంగా నిర్వహించారు. గోవిందనామాలు జపిస్తూ.. రథాన్ని లాగటానికి భక్తులు పోటీపడ్డారు. రధోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ.. భక్తులకు కొవిడ్ నిబంధనలు తెలియజేస్తూ.. మాస్కులు పంపిణీ చేశారు.
మార్కాపురంలోని అయ్యప్పస్వామి ఆలయంలో తిరునక్షత్రం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయం పూజారి సుబ్రమణ్య శాస్త్రి ఆధ్వర్యంలో ఈ వేడుకను జరిపించారు. ఉదయం నుంచి స్వామి వారికి పలు అభిషేకాలు నిర్వహించారు. ఉభయదాతలుగా మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
నగరం శివారులో వెలసిన శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉగాది ముందు ఆదివారాలు ప్రతి ఏడాది ఇక్కడి అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివస్తారు. అమ్మవారి మొక్కులున్న భక్తులు తెల్లవారి జామునుంచే తరలివచ్చి మొక్కులు సమర్పించారు.
ఇవీ చూడండి...: 14 కిలోల గంజాయి పట్టివేత... నలుగురు అరెస్టు