ప్రకాశం జిల్లా దర్శిలోని మోడల్ స్కూల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వనం-మనం కార్యక్రమం నిర్వహించారు. దర్శి సబ్-డివిజనల్ పరిధిలోని అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కూల్ ఆవరణలో సుమారు 100 మొక్కలు నాటారు. వీరితోపాటు విద్యార్థులు, ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ నాగరాజు మాట్లాడుతూ.... మొక్కలు నాటటం కాదు వాటిని పెంచి పెద్ద చేసినప్పుడే ఫలితం ఉంటుందన్నారు. నాటిన మొక్కలను పెంచే బాధ్యతను స్కూల్ సిబ్బందితో పాటు మా సిబ్బంది కూడా వారికి తోడుగా ఉంటారన్నారు. చెట్లు పెంచటం వలన కాలుష్యనియంత్రణ, సకాలంలో వర్షాలు పడతాయన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు అన్నట్లుగానే నేడు మనం నాటిన చిన్న మొక్కే రేపటికి వృక్షమవుతుందని నాగరాజు అన్నారు.
ఇదీ చూడండి పీపీఏలపై ఉన్నత స్థాయి కమిటీ నియామకం