ప్రకాశం జిల్లాలో పోలీసుల పనితీరు హర్షించదగ్గ స్థాయిలో ఉందని ఎస్పీ సిద్దార్థ కౌశల్ అభినందించారు. మార్కాపురంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కరోనా రిలీఫ్ కేంద్రాన్ని సందర్శించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని.. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సిబ్బందికి సరుకులు అందజేశారు.
ఇవీ చదవండి: