ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 సెల్ఫోన్లు, 4,900 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు గిద్దలూరు సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి తెలిపారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుధాకర్ రావు హెచ్చరించారు.
ఇవీ చూడండి...