ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్మిస్తున్న మినీ స్టేడియం తుది మెరుగులు దిద్దుకుంటోంది. గతేడాది మే 14న తెదేపా హయాంలో రూ.2కోట్లతో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ స్టేడియానికి మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్టేడియంలోని గోడలకు అందమైన రంగులు వేశారు. మరికొద్ది రోజుల్లో క్రీడాకారులకు ఈ మినీ స్టేడియం అందుబాటులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి వారిని జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ స్టేడియం ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చూడండి: నూజివీడు ఇండోర్ స్టేడియం కల నెరవేరేనా..?