మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా చట్టం ఎంతో ప్రయోజనకరంగా ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు. ప్రభుత్వం తలపెట్టిన వంద రోజుల దిశా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని ఆయన ప్రారంభించారు. చట్టం పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని కోరారు. 100రోజుల పాటు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నక్షత్ర తాబేళ్లను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు...