ప్రకాశం జిల్లా బల్లికురవ సమీపంలో పదో తరగతి అమ్మాయిని ఓ యువకుడు మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మాయమాటలు చెప్పి తనను యేసేబు అనే వ్యక్తి మోసగించాడని బాలిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నెలక్రితం పరిచయమైన సదరు వ్యక్తి తరచూ తనతో ఫోన్‌లో మాట్లాడేవాడని ఆమె వెల్లడించింది. ఈనెల ఒకటో తేదీన పాఠశాలకు వెళ్తున్న తనను మోసం చేసి బయటకు తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. చీరాల, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాలకు తిప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని... చివరకు గ్రామ సమీపంలో వదిలివెళ్లాడని పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల కోసం ఒంగోలు వైద్యశాలకు పంపించారు.
ఇవీ చూడండి-టిక్‌టాక్‌తో ప్రేమ... రాష్ట్రం దాటిన యువతులు