ETV Bharat / state

ఒంగోలు మేయర్​గా గంగాడ సుజాత

author img

By

Published : Mar 18, 2021, 7:30 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ తొలి మేయర్‌గా గంగాడ సుజాత ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రెసిడెంట్ అధికారి, జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

మేయర్ గంగాడ సుజాత
మేయర్ గంగాడ సుజాత

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్‌గా గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్​గా వేమూరి సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్​లతోపాటు 50 మంది కార్పొరేటర్లు ప్రెసిడెంట్ అధికారి, జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తొలి మేయర్..

నగరపాలక సంస్థ తొలి మేయర్​గా ఎన్నికైన గంగాడ సుజాతకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్​, మంత్రి బాలినేనికి ఆమె కృతఙ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: తిరుపతి మేయర్‌గా శిరీష, డిప్యూటీ మేయర్​గా నారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.