లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని.. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వ్యాపారస్థులు సహకరించాలని కోరారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని... వ్యాధి లక్షణాలు ఉంటే క్వారంటైన్ కేంద్రాలకు స్వచ్ఛందంగా వెళ్లాలని సూచించారు.
ఇదీ చదవండి: