ఒంగోలులో వార్డు వాలంటీర్ దివ్యాంగురాలు భువనేశ్వరి సజీవదహనం ఘటనకు కారణాలింకా తెలియరాలేదు. శుక్రవారం రాత్రి... దశరాజుపల్లెకు వెళ్తూ ట్రై-సైకిల్‌పైనే ఆమె సజీవదహనమైంది. అది ఆత్మహత్యా లేదా హత్యా అన్న అంశంపై స్పష్టత రావట్లేదు. ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత... ఆమె ఆ దారిలో వెళ్తుండటం కొందరు చూశారని చెబుతున్నారు. అదే సమయంలో భువనేశ్వరి తన వాట్సప్ స్టేటస్ ద్వారా... పలువురికి మిస్ యూ, ఇదే నా చివరి మెసేజ్ అంటూ పోస్ట్ చేసింది.
ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో ఆమె మంటల్లో కాలిపోతున్నట్టు స్థానికులు గమనించి.... అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చినా వారొచ్చేసరికే అగ్నికి ఆహుతైంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకూ వార్డు సచివాలయంలోనే ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భువనేశ్వరి చివరగా పెట్టిన వాట్సప్ స్టేటస్‌ల ఆధారంగా.... ఆమెతో సన్నిహితంగా ఎవరు ఉండేవారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది: చంద్రబాబు