ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావూలూరు గ్రామంలో మొక్కజొన్న, శనగల కొనుగోలు కేంద్రాన్ని పర్చూరు నియోజకవర్గ వైకాపా బాధ్యుడు రావి రామనాధంబాబు ప్రారంభించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని.. అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఇదీ చూడండి