ప్రకాశం జిల్లా చీరాల మండలం బుర్లవారిపాలెం వీఆర్వో అబ్దుల్ సలాం.. అనుమానస్పద స్థితిలో మరణించారు. ఉరి వేసుకుని చనిపోయినట్టుగా ఉన్న అతడిని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
అబ్దుల్ సలాం స్వగ్రామం ఇంకొల్లు. అతను.. చీరాల మండలం సాయికాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒక్కరే ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ కరోనా పాజిటివ్ కేసుకు సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్‌లో సలాం ఉన్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: