ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలో కాటంవారిపల్లెలో బాలుడిపై కోతి దాడి చేసింది. రోజు మాదిరిగానే ఆరుబయట ఆడుకుంటున్న పిల్లలపై ఒక్కసారిగా కోతులు దాడి చేశాయి ఈ ఘటనలో గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి అనే ఎనిమిదేళ్ల బాలుడు గాయపడ్డాడు. బాలుడి అరుపులు విని స్థానికులు వాటిని తరిమి కొట్టారు. వెంటనే వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. తమ గ్రామంలో గతంలో పలుమార్లు కోతులు దాడులతో ఎంతోమంది గాయపడ్డారని.. ఎన్నిసార్లు పంచాయితీ అధికారులకు తెలిపినా పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా గ్రామస్థులమంతా కోతుల బారిన పడుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి..తాము కోతుల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చదవండి