ETV Bharat / state

ఆరోగ్య శ్రీ ఉన్నా.. అమలు ఏది..? - నెల్లూరులో కరోనా కేసులు న్యూస్

కొవిడ్ వైద్యం అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. అందులోనూ ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లాలంటే లక్షలు వసూళ్లు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ ఉన్నా మొక్కుబడిగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నా ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు అదేశాలను భేఖాతరు చేస్తున్నారు. ప్రతీ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ కోటా వరకు బాధితులను చేర్చుకోవాలి. అయినా ప్రైవేట్ నిర్వాహకులు ఆసక్తి చూపించడం లేదు.

covid patients facing problems with arogya sree

author img

By

Published : May 20, 2021, 5:32 PM IST

వైద్యానికి ఆరోగ్యశ్రీ వరం లాంటింది. పేదవారి పాలిట పెన్నిధిగా చెప్పుకోవాలి. కొవిడ్​లో మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు అనుమతులు ఉన్నా వాటిని లెక్క చేయడంలేదు. పది రోజులు, రెండు వారాలు లెక్కన ప్యాకేజిలు ప్రకటించారు. భారీగా వసూలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు పడకలు లేవని చెబుతున్నారు. అందరూ ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్నారు. ప్రభుత్వ జీవో 77ప్రకారం వైద్యానికి అయ్యే ఖర్చును ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చెల్లిస్తుంది. ప్రైవేట్ వైద్యశాలలకు ఇది తక్కువగా ఉంటుంది. ఎక్కువ వసూలు చేయడం కోసం ప్యాకేజీ చెల్లించిన వారికే ఆక్సిజన్ బెడ్లు, సాధారణ బెడ్లు ఇస్తున్నారు. ఇప్పటికే 14ఫిర్యాదులు అధికారులకు అందాయి. ఇటీవల పొగతోటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై దాడికూడా చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే గుర్తింపు రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరికలు చేశారు.

అంబులెన్స్ లు కూడా అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. కొన్ని ఆసుపత్రులు ఆక్సిజన్ ను సిలిండర్లతో వ్యాపారం చేస్తున్నారు. బాధితులు 104 కాల్ సెంటర్ ద్వారా మాత్రమే అడ్మిషన్ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే అధికంగా ఫీజు వసూలు చేసిన రెండు ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెబుతున్నారు. జిల్లాలోని 36 కొవిడ్ ఆసుపత్రుల్లో 2,848 పడకలు, కొవిడ్ కేర్ సెంటర్లలో 3500 పడకలు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: ఏపీ డెయిరీ ఆస్తుల వ్యవహారం: 'జీవో నెం.117 రాజ్యాంగ విరుద్దం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.