BK Parthasarathy on Lepakshi lands క్విడ్ ప్రోకో2లో భాగంగా లేపాక్షి భూముల్ని జగన్మోహన్ రెడ్డి హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని తెదేపా సీనియర్ నేత బీకే పార్థసారథి ఆరోపించారు. జగన్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టే వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని 500కోట్లకే ఎర్తిన్ సంస్థకు కట్టబెట్టేందుకు బ్యాంకర్లు సిద్ధపడ్డారన్నారు. చవకగా భూములు కట్టబెట్టేందుకు బ్యాంకర్లు ఎందుకు ఒప్పుకున్నారో, తెరవెనుక ఎవరున్నారో నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్‌చేశారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి అండతోనే ఎర్తిన్ సంస్థ భూ కొనుగోళ్ళకు సిద్ధమైందని దుయ్యబట్టారు. తక్షణమే లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకోకుంటే రైతులతో కలిసి ఉద్యమం తప్పుదని హెచ్చరించారు. 2020 వరకు 4కోట్లు కూడా లేని ఎర్తిన్ సంస్థ ఇప్పుడు జగన్ అండతోనే 500కోట్లతో లేపాక్షి భూముల కొనుగోలుకు సిద్ధపడిందని పార్థసారథి ఆరోపించారు.
"లేపాక్షి భూముల్ని సీఎం హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. సీఎం పాత్ర ఉంది కాబట్టే రూ.500కోట్లకే ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధపడ్డారు. చవకగా భూములు కట్టబెట్టేందుకు బ్యాంకర్లు ఎలా ఒప్పుకున్నారో. తెరవెనుక ఎవరున్నారో తేలాలంటే సీబీఐ విచారణ జరగాలి. సీఎం, విజయసాయి అండతోనే ఎర్తిన్ సంస్థ కొనుగోళ్లకు సిద్ధమైంది. లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం తప్పుదు." -బీకే పార్థసారథి
ఇవీ చదవండి: