కర్నూలు జిల్లా పత్తికొండ మండలం నలకదొడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా మద్దతుదారురాలి భర్త, ఆ పార్టీ మండల అధ్యక్షుడు బత్తిన లోకనాథ్పై వైకాపా నాయకులు దాడి చేశారు. అటికెలగుండులో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ కె.ఈ. శ్యామ్‌బాబు గ్రామానికి చేరుకోగా.. ప్రత్యర్థి నేత బాబుల్ రెడ్డి, అతని అనుచరులపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నలకదొడ్డిలో పోలీసులు భారీగా మోహరించారు.
ఇదీ చదవండి: