కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జీ.వీ.ఆంజనేయులు అన్నారు. కరోనా కారణంగా ఉపాధి లేక పస్తులుంటున్న కుటుంబాలకు రూ.10వేలు, మహమ్మారితో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వైకాపా ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిందని తెదేపా నేత కోవెలమూడి రవీంద్ర అన్నారు. ఆస్పత్రుల్లో సరిపడా పడకలు, ఆక్సిజన్ సదుపాయాలు లేవన్నారు. కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలను ఆదుకోవాలని తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు.
వైకాపా ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందని తెదేపా నేతలు ఆరోపించారు. ప్రజలను కాపాడాల్సి బాధ్యత వదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీకా ప్రక్రియలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతోందని అన్నారు. రాష్ట్రంలో టీకా ప్రక్రియ వేగవంతం చేయాలని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కురు గొండ్లా రామకృష్ణ డిమాండ్ చేశారు. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందని.. అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: