ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల మూడవ రోజైన సోమవారం రాత్రి శ్రీశైలంలోని శివ దీక్షా శిబిరాల వద్ద జరిగిన వీరాచార విన్యాసాలు భక్తులను విశేషంగా అలరించాయి. కర్ణాటకకు చెందిన వీరశైవ భక్తులు కత్తి విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.
కత్తి విన్యాసాలతో పాటు పెదవులకు శూలాలు గుచ్చుకొని అబ్బురపరిచారు. చివరగా భక్తులు కణకణమండే నిప్పుల్లో నడిచి స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. స్థానికులు సైతం వారితో పాటు నిప్పుల్లో నడిచారు. ఉగాది సందర్భంగా కన్నడ భక్తులు వీరాచార విన్యాసాలు చేయడం ప్రతి ఏడాది ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.
ఇదీ చదవండి: